ELR: రైతులు భూసార పరీక్షలు చేయించుకోవడం ద్వారా పంటల్లో అధిక దిగుబడి సాధించవచ్చునని జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హాబీబ్ భాషా సూచించారు. చింతలపూడి, లింగపాలెం మండలాల్లో శనివారం ఆయన పర్యటించారు. భూసార పరీక్ష ద్వారా పంట పొలాల్లో సూక్ష్మ పోషక లోపాలను గుర్తించవచ్చు అన్నారు. రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించారు.