TG: మెదక్ జిల్లా తూప్రాన్‌లో విషాదం నెలకొంది. పిడుగుపాటుతో ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు ప్రసాద్, యశ్వంత్గా గుర్తించారు. మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఇరు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.