VZM: పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి చెందినట్లు బొండపల్లి ఎస్సై మహేష్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామ సమీపంలో గొర్రెలను మేపుతుండగా గజపతినగరం మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన దేవర గంగులు(45)పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు.