NRML: ఈ నెల 22 నుంచి 28 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. శనివారం రాత్రి సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలోని 11 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో జరిగే పరీక్షలకు 4,927 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.