KDP: స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని పులివెందుల ఆర్డీవో చిన్నయ్య అధికారులను ఆదేశించారు. శనివారం పులివెందులలోని ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో గౌరవంగా మాట్లాడాలని అధికారులకు సూచించారు.