SKLM: వీరఘట్టం పట్టణంలోని రెల్లి వీధిలో పారిశుద్ధ్య పనులపై అధికారులు శ్రద్ద పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడకక్కడ చెత్త పేరుకుపోవటంతో స్థానికులు ఆగ్రహిస్తున్నారు. బహిరంగంగా మల విసర్జన చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలిగించాలన్నారు.