TG: FRBM రుణ పరిమితి, అప్పులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం నెలకొంది. అప్పుల వివరాలను భట్టి ప్రకటించగా హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందని ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ చర్చలు పెడుతూ BRS సభను తప్పుదోవ పట్టిస్తుందని భట్టి మండిపడ్డారు. అప్పులపై చర్చకు సిద్ధమని, అందుకోసమే శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు.