మంచు కుటుంబం వివాదం నేపథ్యంలో మోహన్ బాబు భార్య నిర్మల తొలిసారి స్పందించారు. ఈ మేరకు తన స్టేట్మెంట్కు సంబంధించిన లెటర్‌ను విడుదల చేశారు. మంచు మనోజ్ ఫిర్యాదులో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదని వెల్లడించారు. తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసమే జల్పల్లిలోని ఇంటికి విష్ణు వచ్చినట్లు చెప్పారు. అనంతరం గదిలో ఉన్న తన సామాను తీసుకుని విష్ణు వెళ్లిపోయాడని తెలిపారు.