AP: తన కోసం 4 రోజులుగా ఎదురుచూస్తున్న రైతును DY.CM పవన్ కలిశారు. పార్టీ కార్యాలయం వద్ద ఎడ్లబండితో నిరీక్షిస్తున్న రైతు నవీన్ వద్దకు పవన్ వెళ్లారు. రైతుల సమస్యలను పవన్‌కు నవీన్ వివరించారు. పంట ఉత్పత్తులను రైతులు అమ్ముకోలేకపోతున్నారని, దళారుల బెడద ఉందని తెలిపారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అధిక సమయం కేటాయించలేకపోతున్నానని.. రైతుల సమస్యలపై తన కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వాలని రైతుకు పవన్ సూచించారు.