TG: అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందనేది అవాస్తమని ధ్వజమెత్తారు. BRS హయాంలో రూ.4 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో నిరూపించడానికి దేనికైన సిద్ధమని పేర్కొన్నారు.