AKP: ఎలమంచిలి పట్టణ రామ్మూర్తి నగర్లో గల రిటైర్డ్ ఎక్సైజ్ ఉద్యోగి బీవీ రమణ ఇంటిలో దొంగలు పడి రూ.4లక్షలు, 4 తులాల బంగారం దోచుకుపోయారు. ఇంటికి తాళాలు వేసి రమణ కుటుంబ సభ్యులు బళ్లారి వెళ్లారు. సోమవారం పనిమనిషి వచ్చి చూడగా తాళం తీసి ఉంది. రమణ ఇంటికి వెళ్లమనడంతో బంధువులు వెళ్లి పరిశీలించగా నగదు, బంగారం పోయినట్లు గుర్తించారు. ఈమేరకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.