VZM: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం బోడి కొండ చుట్టూ ఉన్న ప్రభుత్వ, దేవస్థానం భూములు ఆక్రమణకు గురయ్యాయి. బోడికొండ ఉత్తర భాగంలో భూములను కొంతమంది ఆక్రమించి మామిడి మొక్కలు వేయడంతోపాటు, ఇతర పంటలను సాగుచేస్తున్నారు. సోమవారం రామతీర్థంలో రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవి రెవెన్యూ అధికారులకు ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు.