VZM: చీపురుపల్లిలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు ఆరవెల్లి రవి కుమార్ వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ముందుగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేష పూజలు చేశారు. ఈసందర్బంగా చీపురుపల్లితోపాటు చుట్టు పక్కల గ్రామాల వారు ఆ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.