TG: అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాజీమంత్రి హరీశ్ రావుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ‘సభను, సభ మర్యాదలను హరీశ్ రావు అవమానిస్తున్నారు. పాత రూల్స్ బుక్ మార్చి.. BRSకు అనుగుణంగా కొత్త బుక్ పెట్టారు. బీఏసీ నుంచి BRS నేతలు వెళ్లిపోయారు. స్పీకర్‌ను అవమానించి పేపర్లు పడేశారు. ప్లకార్డులు చించి స్పీకర్‌పై విసిరేయటం పద్దతి కాదు. మీరు శాసించినట్లు సభ నడవాలంటే కుదరదు’ అని మండిపడ్డారు.