ASR: దారకొండలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో సీలేరు ఎస్సై రవీంద్ర తన సిబ్బందితో స్థావరంపై మంగళవారం దాడి చేశారు. ఈ దాడుల్లో ఆరుగరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.11,600, 8 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు.