గూగుల్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు చాట్ జీపీటీ సిద్ధమైంది. ఖాతా ఉంటే చాలు ఓపెన్ AI మొబైల్ యాప్స్, వెబ్‌సైట్‌ను యూజర్లందరూ వినియోగించుకోవచ్చని సదరు కంపెనీ వెల్లడించింది. ఇందుకు సబ్స్క్రిప్షన్ అవసరం లేదని పేర్కొంది. గతంలో కేవలం పెయిడ్ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఉండే ఫీచర్లు ఇకపై అందరికీ అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా, 2024 నవంబర్‌లో చాట్ GPT సెర్చ్‌ను ఓపెన్ ఏఐ ప్రారంభించింది.