TG: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం రెవెన్యూ డివిజన్లు సరిగా చేయలేదని.. రెవెన్యూ డివిజన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మక్తల్ను రెవెన్యూ డివిజన్ చేస్తే ఉపయోగమని ఎమ్మెల్యే శ్రీహరి తెలిపారు. మక్తల్, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సమాధానమిచ్చారు.