VZM: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొని 2వ స్థానం సాధించిన విజయనగరం జిల్లా మహిళా క్రీడాకారులను MLA అదితి అభినందించారు. ఆడ పిల్లలు అంటే వంటింటికే అనే సామెతను తిరగరాసి.. ఆడ పిల్లలంటే ప్రపంచాన్ని జయించింది అని నిరూపించారని వారిని అభినందించారు. మరెన్నో విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.