BHPL: నైన్ పాక గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్సై సతీశ్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించి, వారి వద్ద నుంచి రూ.2,100 నగదుతో పాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో రేపాల ప్రభాకర్, రత్న తిరుపతితో సహా మరో నలుగురు ఉన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్సై హెచ్చరించారు.