HYD: బోరబండ మధురానగర్‌లో కుళ్లిన పదార్థాలతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిందితుడు నిల్వ ఉంచిన 45 కిలోల నకిలీ పేస్ట్‌ను సీజ్ చేసి, నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. కుళ్లిన ముడిసరుకుకు ఎసిటిక్ యాసిడ్ కలిపి హోల్‌సేల్ దుకాణాలు, క్యాటరింగ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.