AP: పాతిక సంవత్సరాల వ్యవధిలో 500 కోట్ల భోజనాల మైలురాయిని అందుకున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ‘పీఎం పోషణ్, అన్న క్యాంటీన్లలో అక్షయపాత్ర ఫౌండేషన్ భాగస్వామిగా ప్రజలు, చిన్నారులకు సేవలందిస్తోంది. ఆ సంస్థ 500 కోట్ల భోజనాల మైలురాయిని సాధించడం గర్వకారణం. ఈ ఫౌండేషన్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు.