MDCL: అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్లోని లక్ష్మీ ఎంక్లేవ్, స్రవంతి నగర్ కాలనీలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీలో పెండింగ్లో ఉన్న సమస్యలను కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కాలనీ అధ్యక్షులు రాజేందర్ యాదవ్, వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.