MBNR: డోర్నకల్-గద్వాల్ రైల్వే లైనుకు త్వరగా ఆమోదం తెలపాలని నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి కోరారు. శనివారం ఢిల్లీలో రైల్వే బోర్డు ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 296 కి.మీ. నిడివి గల ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. తక్షణమే బడ్జెట్ కేటాయించి పనులు ప్రారంభించాలని విన్నవించారు.