BHPL: నియోజకవర్గంలో నిర్వహించిన డీఎల్ఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ బ్యాంకుల పనితీరుపై స్పందించారు. పాత రుణాలు పూర్తిగా చెల్లించిన రైతులకు తిరిగి రుణాల మంజూరు, రెన్యువల్ ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని సూచించారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాల విడుదలలో చురుకుదనం చూపించాలని, ప్రభుత్వ పథకాల అమలుకు బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.