KMR: తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. రవీందర్ గౌడ్ మంగళవారం సందర్శించారు. రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఫార్మసీ, ల్యాబ్ గదులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.