MHBD: నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలోని బియ్యాల కిషన్ రావు వీధిలో తాగునీటి సరఫరా కోసం సుమారు మూడు దశాబ్దాల కాలం కిందట నెలకొల్పిన పైపులన్ని చెట్ల వేర్లతో నిండిపోయాయి. దీంతో నెల రోజులుగా వీధిలోని పలు గృహలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. స్పందించిన గ్రామ పంచాయతీ సిబ్బంది మరమ్మతులు చేపట్టగా, పైపులో సుమారు 40 ఫీట్ల పొడవున్న వేర్లను తొలగించారు.