BDK: టేకులపల్లి మండలంలోని గోలియా తండాలో ఇవాళ ఉచితకంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ లాకావత్ నాకానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య బృందం గ్రామస్థులకు కంటిపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీణప్రాంతాల్లోని పేద ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.