BPT:చీరాల మండలం ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కలవారిపాలెం ప్రాంతంలో బుధవారం పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారంతో ఎస్సై చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 11,200 రూపాయలు నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, ఆరు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఎస్సై చెప్పారు.