NLG: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజలవద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో ప్రజావాణి ఫిర్యాదులపై ఆమె సమీక్షించారు. రెవిన్యూమున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్, వ్యవసాయ శాఖల వద్ద ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయన్నారు.