ADB: CMRF పేద ప్రజలకు వరం లాంటిదని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు CMRF చెక్కులను గురువారం పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల వివరాలను కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో సమర్పించి CMRF ద్వారా లబ్ధి పొందాలని కోరారు. మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.