KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి ప్రబంధ సేవ అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయ ప్రధాన అర్చకులు శేషం వంశీధర చార్యులు సుందరంగా అలంకరించి హనుమత్ వాహనంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మాడ వీధులలో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.