SRCL: గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్లో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారో అడిగి తెలుసుకున్నారు.