BDK: ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. రేగళ్ల రేంజ్ నుంచి ఆళ్లపల్లి రేంజ్‌లోకి ప్రవేశించిన పులి అడుగుజాడలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రైతులు, కూలీలు ఎవరూ వ్యవసాయం చేనులకు వెళ్ళొద్దని అటవీ అధికారులు హెచ్చరించారు. గ్రామస్తులు ఒంటరిగా తిరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.