ASF: తిర్యాణి మండలం గంభీరావుపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలను అదనపు కలెక్టర్ దీపక్ తివారి శనివారం సందర్శించి విద్యార్థుల హాజరు రికార్డులు, తరగతి గదులు పరిశీలించారు. AI బోధన ద్వారా విద్యార్థులకు మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించవచ్చన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.