MDK: తూప్రాన్కి చెందిన బుడ్డ శ్రీను(35) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై శివానందం తెలిపారు. శ్రీను వివాహం 15 ఏళ్ల క్రితం హేమలతతో జరగగా ముగ్గురు సంతానం ఉన్నారు. కుటుంబ కలహాలతో ఆరునెల క్రితం పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈనెల 3న ఇంట్లో నుంచి బ్యాంకు వెళ్తున్నట్లు చెప్పి తీరిగి రాలేదు. దీంతో తల్లి సుశీల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.