ASF: కెరమెరి మండలం కేస్లాగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్డు సమస్య పరిష్కారించాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మడవిగూడ,చిన్నగూడ గ్రామాల రహదారి పరిశీలించారు. ఈ గ్రామాలకు కనీసం అంబులెన్స్ వెళ్ళే దారి లేదన్నారు. గర్భిణీలు,ప్రజలు అత్యవసర పరిస్థితిలో నరకయాతన పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలన్నారు.