PPM: మార్కెట్ కమిటీల ద్వారా రైతులకు మెరుగైన సేవలు లక్ష్యంగా అంతా పనిచేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర సూచించారు. పార్వతీపురం మార్కెట్ కమిటీలో శనివారం AMC అధ్యక్షురాలు గౌరీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్యే సమావేశంలో పాల్గొని మార్కెట్ కమిటీ అభివృద్ధి పై చర్చించారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.