W.G: వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారైనా చదువుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పది, ఇంటర్మీడియట్ చదువుకోవడానికి అవకాశం ఉందని పాలకోడేరు ఎంఈవో-2 తంగిరాల హరి ఆనంద్ ప్రసాద్ అన్నారు. శనివారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలకోడేరు సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించారు.