VKB: కోట్పల్లి మండలం జిన్నారం గ్రామంలో గణేశ్ లడ్డూ వేలం రికార్డు ధర పలికింది. గ్రామంలోని వినాయక మండపం వద్ద జరిగిన ఈ వేలంలో అదే గ్రామానికి చెందిన హుసేన్ అనే ముస్లిం యువకుడు లడ్డూను రూ. 26,000కి ఇవాళ దక్కించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడిని భాజా భజంత్రీలతో, నృత్యాలతో నిమజ్జనం పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.