TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 2,54,685 గణేశ్ ప్రతిమల నిమజ్జనం చేశారు. హుస్సేన్ సాగర్లో ఈరోజు సుమారు 10 వేల గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ యంత్రాంగం క్షేత్రస్థాయిలో అన్ని నిమజ్జన పాయింట్లలో ప్రతిమల నిమజ్జనం సాఫీగా, సురక్షితంగా జరిగేలా కృషి చేస్తుందని అధికారులు చెబుతున్నారు.