హాకీ ఆసియా కప్ ఫైనల్‌కు భారత్ దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో చైనాపై 7-0 తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. వరుస గోల్స్‌తో చైనాను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ విజయంతో భారత్ టైటిల్‌కు ఒక అడుగు దూరంలో నిలిచింది. ఫైనల్స్‌లో భారత్, కొరియా తలపడనున్నాయి. 8 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారి ఆసియా కప్ ఫైనల్ చేరుకుంది.