అన్నమయ్య: మదనపల్లెకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్కు శనివారం రాత్రి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ జిల్లా నాయకులతో పాటు నియోజకవర్గ నేతలు పట్టణంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద పూల బొకేలను అందజేసి, సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి 200 బైకులతో ర్యాలీగా స్థానిక శ్రీకృష్ణ కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు.