అన్నమయ్య: బొప్పాయి రైతులకు కిలో రూ.8 ఇవ్వాలని రాజంపేట సబ్ కలెక్టర్ భావన తెలిపారు. శనివారం కోడూరు తహసీల్దార్ కార్యాలయంలో బొప్పాయి ఢిల్లీ వ్యాపారస్తులు, దళారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సోమవారం నుంచి రైతులకు మొదటి దశ బొప్పాయి కాయలకు రూ.8, రెండో దశ కాయలకు రూ.7 ఇవ్వాలని అందరూ సమక్షంలో నిర్ణయించినట్లు తెలిపారు.