మెదక్ పట్టణంలో ఫతేనగర్ బాలాజీ మఠం దగ్గర యువసేన, గణేష్ మండలి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని గణేష్ లడ్డూ లక్కీ డ్రా కూపన్ నిర్వహించారు. ఈసందర్భంగా ఇవాళ లక్కీ డ్రా నిర్వహించగా, ఎస్ఆర్ కంస్ట్రక్షన్కు సంబందించిన సంపత్కు అదృష్టం వరించింది. దీంతో ఆ యువకుడిని ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానం నిర్వహించారు.