కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి మానవత్వం చాటుకున్నారు. అమలాపురంకి చెందిన వికలాంగుడు నాగేశ్వర రావు వద్ద నుంచి చెన్నైలో ఒక మోసగాడు డబ్బు తీసుకుని పరారయ్యాడు. తన పరిస్థితిని ఫోన్లో జేసీకి వివరించాడు. దీనిపై వెంటనే స్పందించిన జేసీ నాగేశ్వరరావు కుటుంబానికి రైలు టికెట్లు, ప్రయాణ ఖర్చుల కోసం నగదు అందించి మానవత్వం చాటుకున్నారు.