KMM: కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. శోభాయాత్ర ప్రారంభమైన అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి నగరంలోని కాల్వఒడ్డు వద్ద నిమజ్జన ఘాట్‌ను సందర్శించారు. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.