SRD: కంగ్టి మండల తడ్కల్లో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి గణేష్ ఉత్సవ కమిటీ లక్కీ డ్రా నిర్వహించింది. ఇందులో గ్రామానికి చెందిన కుమ్మరి పండరి వినాయకుడి లడ్డూతో పాటు LED TVని గెలుచుకున్నారు. నిరుపేద కుటుంబమైన వీరు రూ.100 చెల్లించి డ్రాలో పాల్గొన్నారు. అనూహ్యంగా అదృష్టం తలుపు తట్టడంతో వారి ఆనందానికి అవధులు లేవని కమిటీ సభ్యులు తెలిపారు.