SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టు రెండు గేట్లు ద్వారా దిగువకు ఔట్ ఫ్లో కొనసాగుతున్నదని సంబంధిత ఏఈఈ స్టాలిన్ శనివారం సాయంత్రం తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ ప్రాంతాల నుంచి 24,630 క్యూసెక్కుల వరద చేరుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.570 టీఎంసీలు జలాలు నిల్వ ఉన్నట్లు తెలిపారు.