SKLM: పొందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జనం ఊరేగింపులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పూర్తయ్యాయని ఎస్సై సత్యనారాయణ తెలిపారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు, భక్తులు సహకరించడంతో ఎటువంటి అంతరాయం లేకుండా జరిగాయన్నారు.