న్యాయశాఖలో మహిళల పాత్రపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ. రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. SC చరిత్రలో ఇప్పటివరకు కేవలం 11 మంది మహిళలే న్యాయమూర్తులు కావడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. మన న్యాయవ్యవస్థలో సామాజిక వైవిధ్యం, సమ్మిళితత్వం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ లక్ష్యాలను సాధించడానికి వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.